మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కంటైన్మెంట్ ఏరియాలో పర్యటన.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కంటైన్మెంట్ ఏరియాలో పర్యటన....

 శుభ తెలంగాణ(25ఏప్రిల్20)మేడ్చల్  జిల్లా శనివారం కాప్రా లోని సాయి బాబా నగర్,  మౌలాలి లోని హెచ్ బి కాలనీ, రామంతపూర్ లోని చర్చి కాలనీలో  కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినందున జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినందున కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడం జరిగిందని, ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బారికేడ్లను ఏర్పాటు చేసి దార్లను దిగ్బంధం చేయాలన్నారు. వైద్య, మున్సిపల్, పోలీసు, రెవెన్యూ సమన్వయంతో  కరోనా కేసులు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో ఒక కిలోమీటర్ రేడియస్ వరకు ఇంటింటి సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నిత్యావసర సరుకులకు ప్రజలు బయటికి రాకుండా ఉండాలని సూచించారు. 
కలెక్టర్ తన చేతుల మీదుగా ఆశా వర్కర్లకు పార్లేజి బిస్కెట్ ప్యాకెట్ లు అందజేశారు.ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్,ఆర్ డి ఓ రవి, డిఎం అండ్  హెచ్ఓ వీరాంజనేయులు,డిప్యూటీ డిఎం  అండ్ హెచ్ఓ నారాయణ, కాప్రా తహసీల్దార్ గౌతమ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు...