జర్నలిస్టులకు పిసిసి కార్యదర్శి, సోమన్న యువసేన అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

జర్నలిస్టులకు పిసిసి కార్యదర్శి, సోమన్న యువసేన అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణి

శుభతెలంగాణ న్యూస్:(మేడ్చల్ జిల్లా)కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇబ్బంది పడుతున్న కప్రా సర్కిల్ జర్నలిస్టులకు పిసిసి కార్యదర్శి, సోమన్న యువసేన అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం , నిత్యవసర సరుకులు, మాస్కులను, శానిటైజర్ లను సోమవారం కుషాయిగూడలోని తన నివాసం వద్ద అందజేశారు.ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు సేవా
కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు కుషాయిగూడ బస్టాండ్, నేతాజీనగర్, అల్వాల్ లో 12 వందల మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి వేలాది మందికి బియ్యం,కూరగాయలు,నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు మోతె వెంకటరెడ్డి, జర్నలిస్టులు, స్థానిక నాయకులు బబ్బి, నాను, వీరేష్, శ్రీకాంత్, టిల్లు, చల్ల రాము, చందు, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad