ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టులో పిటిషన్

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్తలు హర్ష మాందర్, అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు,కూలీలు ఉపాధి కోల్పోయారని, దాంతో తినడానికి తిండి లేక వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి
విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది.

Post Top Ad