బహిరంగ ప్రదేశాల్లో పాన్ వేసుకొని ఉమ్మివేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

బహిరంగ ప్రదేశాల్లో పాన్ వేసుకొని ఉమ్మివేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు

శుభ తెలంగాణ (16,ఏప్రిల్ , 2020)  : కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మరో సూచనను అమల్లోకివచ్చింది . బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోడ్లపై ఉమ్మి వేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి రోడుపై పడేయడంపై నిషేధం విధించింది. ఎవరైనా ప్రభుత్వ  నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నేరంగా ప్రకటించారు. తెలంగాణలో సైతం రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఓల్డ్ మలక్ పేట్ కు చెందిన గౌసేద్దీన్ అనే వ్యక్తి రామంతపూర్ విశాల్ మార్ట్ నుండి వెళ్తూ పాన్ వేసుకొని ఉమ్మివేయడంతో ఆ వ్యక్తిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Post Top Ad