సత్వరమే స్పందించిన మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు ....... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

సత్వరమే స్పందించిన మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు .......

మేడ్చల్ జిల్లా ప్రతినిధి : దేశం వ్యాప్తంగా  లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో   రాచకొండ కమిషనర్ కార్యాలయాని , కీసర పోలీస్ స్టేషన్ కి  తన అత్తగారికి ఆరోగ్య సమస్య ఉంది (షుగర్ పేషంట్) లాక్ డౌన్ కారణంగా  బయటకు వెళ్లి మందులు తెచ్చుకునే పరిస్థితి లేదని ట్విట్టర్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తమ దృష్టికి ఈ విషయం రాగానే సత్వరమే స్పందించిన కీసర పోలీసులు రాంపల్లి ఆర్.ఎల్ నగర్ కాలనిలో నివాసం ఉంటున్న చిట్టి రత్నంకు మెడికల్ షాప్ నుండి  మందులు  తీసుకుని  అందజేయడం జరిగింది. తమ స్వంత కుటుంబ సభ్యుల్లా సత్వరమే స్పందించిన తీరుకి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Post Top Ad