డ్రైనేజీ నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

డ్రైనేజీ నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు

కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ లో గత 15 రోజుల నుండి పాండుబస్తి, హనుమాన్ గుడి దగ్గర డ్రైనేజీ పైపు పగిలి డ్రైనేజీ నీరు రోడ్డుమీదే పారుతుంది. కరోనా భయంతో ఒకవైపు ప్రజలు నానా కష్టాలు పడుతుంటే.. మరోవైపు డ్రైనేజీ నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.జిహెచ్ఎంసి అధికారులకు ఈ సమస్యను పరిష్కరించమని ఎన్నో సార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని.. ఇకనైన ఈ సమస్యను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

Post Top Ad