ఇకపై ఎమర్జెన్సీ లేకుండా బయటికి వస్తే క్రిమినల్ కేస్... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

ఇకపై ఎమర్జెన్సీ లేకుండా బయటికి వస్తే క్రిమినల్ కేస్...

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఇకపై పోలీసుల అనుమతి లేకుండా ఏలాంటి నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇతరత్రా వాటిని పంపిణీ చేయకూడదని షాద్ నగర్ ఐపీఎస్ అధికారిని రీతిరాజ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు. పట్టణంలో సామాజిక దూరాన్ని పాటించకుండా ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఐపీఎస్ సంచలన విషయం ప్రకటించారు. ప్రభుత్వ లాక్ డౌన్ ఉద్దేశాన్ని మార్చే విధంగా కొందరు నిబంధనలకు వ్యతిరేకంగా పంపిణీలు చేస్తున్నారని దీనివల్ల కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇకపై ఎమర్జెన్సీ లేకుండా బయటికి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అదేవిధంగా వారి యొక్క వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సెక్షన్లు 188, 270, 271 ప్రకారం కేసు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో, వార్త ప్రసార మాధ్యమాలలో పత్రికల్లో ఛానల్స్ లో ఆధారం లేని వార్తలను సృష్టించినా, అవి పోస్టులు చేసినా వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వీడియోలను పోస్టులు చేయడం లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమయంలో వ్యాధి పట్ల అభద్రత కల్పిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

అంతేకాదు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించిన ప్రకారం కూరగాయల కొనుగోలు జరగాలని దానికి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలను కేటాయించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల వివరాలను ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. వినాయక గంజ్ లో 2, 28, 16, 21 వార్డులకు చెందిన ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలని, అదేవిధంగా జి హెచ్ ఆర్ గ్రౌండ్ వద్ద 5,6, 22, 23, 28, వార్డులకు సంబంధించిన ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద 1, 27, 15 వార్డులకు సంబంధించిన వారు కొనుగోలు చేయాలని, అలాగే దత్తాత్రేయ గుడి సమీపంలో 3,4 వార్డులకు సంబంధించిన ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా కూరగాయలు అని ఇతరత్రా సరుకులు సామాన్లు అని రోడ్లపైకి కారణం లేకుండా వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post Top Ad