డబ్బుల కోసం దారుణ హత్య : స్నేహితున్ని బలి చేసిన వైనం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

డబ్బుల కోసం దారుణ హత్య : స్నేహితున్ని బలి చేసిన వైనం

శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020 - హైదరాబాద్ ప్రాంతీయం) : డబ్బుల కోసం తోటి  స్నేహితుడి ప్రాణం బలి చేసిన  ఘటన గురువారం చోటుచేసుకుంది. అజిత్ యాదవ్ (20) అనే వ్యక్తి ని  దారుణంగా హత్య చేసి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడేసారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అజిత్ యాదవ్, శంకర్ అనే ఇద్దరు స్నేహితులు ఓ ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే బుధవారం  సాయంత్రం అజిత్ యాదవ్, శంకర్ యాదవ్ కి మధ్య  డబ్బుల విషయంలో చిన్న వివాదం తెలెత్తింది.  దీంతో డబ్బుల కోసమే శంకర్.. అజిత్ ని హత్య చేసి ఉంటారని.. అనుమానంతో శంకర్ ని అదుపులోకి తీసుకుని మైలార్ దేవ్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా.స్థలానికి చేరుకున్న శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, రాజేంద్రనగర్  అశోక చక్రవర్తి.. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ అజిత్ యాదవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.