బీజేపీ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో శానిటైజర్ పిచికారీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

బీజేపీ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో శానిటైజర్ పిచికారీ...

శుభతెలంగాణన్యూస్: మేడ్చల్ జిల్లా లో కరోనా మహమ్మారిని తరిమికొడుతూ, ప్రజ ఆరోగ్యమే ప్రథమంగా పని చేస్తున్న మేడిపల్లి పోలీస్ సిబ్బందికి మరియు మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి కృతజ్ఞతతో పీర్జాదిగుడా కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో నిత్యం రద్దీగా ఉండే మేడిపల్లి పోలీస్ స్టేషన్ మరియు పీర్జాదిగుడా కార్పొరేషన్ కార్యాలయాన్ని శానిటైజ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.ఐ.అంజి రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ లు బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, స్వరూప్ చంద్ర, అనిల్ రెడ్డి,.సుధాకర్ చారి, కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.