ఎల్బీనగర్ లో పేకాట రాయుళ్లను అరెస్టు , భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

ఎల్బీనగర్ లో పేకాట రాయుళ్లను అరెస్టు , భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020 -రంగారెడ్డి జిల్లా) :  దేశ వ్యాప్తంగా కోవిడ్ -19 మృత్యు ఘంటికలు మోగిస్తుంటే , తెలంగాణ రాజధాని  హైదరాబాద్ సమీపంలో  ఎల్బీనగర్, చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిందూర గ్రాండ్ హోటల్ లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఏడుగురు పేకాటరాయుళ్ల ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ , 34 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం చైత్యన్య పురి పోలీసులకు అప్పగించారు.

Post Top Ad