శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020 - కరీంనగర్) : కరీంనగర్ జిల్లాలోని కరోనా వైరస్ రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజల యొక్క కదలికలను రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది సమన్వయంతో వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వచ్చే మే 7 వరకు వైద్య బృందాలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యంగా కట్టడి ప్రాంతాల్లో వారిని ఎప్పటికప్పుడు స్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ఈ సందర్భంలో జ్వరం, దగ్గు, జలుబు, శరీర నొప్పులు ఉన్నట్లు గమనించిన యెడల అలాంటి వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు. అంతేకాక శ్వాసకోశ, గుండె, కాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులున్న వారిని, 60 సంవత్సరాలు పై బడిన వృద్ధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
Post Top Ad
Friday, April 24, 2020
కరీంనగర్ లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు : కలెక్టర్ శశాంక
Admin Details
Subha Telangana News