తార్నాక డివిజన్ లో ఉచిత రేషన్ బియ్యం పంపిణి...... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

తార్నాక డివిజన్ లో ఉచిత రేషన్ బియ్యం పంపిణి......

తార్నాక డివిజన్ లో రేషన్ షాపుల్లో 12 కిలోల బియ్యం పేదలకు ఇచ్చే కార్యక్రమం తార్నాక డివిజన్ లోని లాలాపేట్లో  కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి హరి ప్రారంభించినారు. రెక్కాడితేగాని డొక్కాడని పేద వారి కోసం ఆలోచించి 12 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు కొనుగోలు కోసము1500 రూపాయలు నగదును బ్యాంకు అకౌంట్లో వేస్తామని
చెప్పడం గర్వించదగ్గ విషయమని కార్పొరేటర్ కొనియాడారు.

అదేవిధంగా రేషన్ షాప్ కి వచ్చిన మహిళలను ఉద్దేశించి సామాజిక దూరం పాటిస్తే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టొచ్చన్నారు. ఎవరైనా తమ ప్రాంతాల్లో కొత్త వారు కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్, సంతోష్,
సునీల్, ముదిరాజ్ వంజరి వెంకటేష్, వనజ, శైలజ, మేరీ మొదలగు వారు పాల్గొన్నారు.

Post Top Ad