పోలీసు అధికారులకు శానిటైజర్లు, మాస్క్ లు పంపిణి చేసిన సినీ హీరో శ్రీకాంత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

పోలీసు అధికారులకు శానిటైజర్లు, మాస్క్ లు పంపిణి చేసిన సినీ హీరో శ్రీకాంత్

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-హైదరాబాద్) : కరోనా కట్టడికి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తన వంతు సాయంగా హీరో శ్రీకాంత్ శానిటైజర్లు, మాస్క్ లు అందించారు. , ఇంతటి కఠిన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ఎంతో విలువైనవని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు ఆయన శానిటైజర్లు, మాస్క్ లు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసుల సేవలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఏసీపీ కే.ఎస్.రావు, బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు పాల్గొన్నారు.