లాక్ డౌన్ పై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు వినూత్న ప్రయోగం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

లాక్ డౌన్ పై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు వినూత్న ప్రయోగం

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - వరంగల్ ) :  లాక్ డౌన్ పై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. పోలీసు చెక్ పాయింట్ల దగ్గర షో డాల్స్ ఏర్పాటు చేసి బయటకు ఎవరూ రావద్దని అవగహన కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి ప్రజలను బయటకు రానియకుండా  చేస్తున్నారు. బయటకు వచ్చే వారికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కవగా బయటకు వచ్చే వారి బైక్ లను సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కొత్తగా పోలీసులు వినూత్న కార్యక్రమం  చేపట్టారు. షో డాల్స్ తో శానిటైజర్స్ ద్వారా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఎవరూ బయటకు రావొద్దంటూ షో డాల్స్ ద్వారా విజ్ఞప్తి చేయిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.