మేడ్చల్ జిల్లాలో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

మేడ్చల్ జిల్లాలో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) : మేడ్చల్  ఎంపిపి పద్మ జగన్ రెడ్డి కరోనా నేపథ్యంలో కూడా నిరంతరం కృషి చేస్తున్న ఆశా వర్కర్ మరియు ఎఎన్ఎమ్ కార్మికులకు 20 కిలోల బియ్యం మరియు రోజువారీ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మర్రి రాజశేకర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు శానిటైజర్లను పంపిణీ  చేసారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ చైర్మన్ దీపిక నర్సింహ రెడ్డి, గుండ్లపోచంపల్లి చైర్మన్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ, వైస్ ఎంపిపి రజిత, వైస్ చైర్మన్, ఎంపిటిసి లు, సొసైటీ చైర్మన్  లు, డైరెక్టర్ లు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.