కృతజ్ఞతలు తెలిపిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 07, 2020

కృతజ్ఞతలు తెలిపిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు....

శుభతెలంగాణన్యూస్ (మేడ్చల్ జిల్లా) :కూకట్ పల్లి నియోజకవర్గం లో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశానుసారం ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేస్తున్న కార్యకర్తలకు ..నేతలకు అసోసియేషన్ సభ్యులకు.. ప్రజలకు ..ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఎంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ విధించారని... ఇప్పుడు కానీ ప్రజల్ని ఈ విధంగా లాక్ డౌన్లో ఉంచకపోతే తీవ్ర పరిణామాలు జరిగేవని.. దేశంలోనే ఆదర్శంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు గారు తీసుకునే నిర్ణయాలను ..ప్రధానమంత్రి కూడా కొనియాడారు అని ఆయన తెలిపారు.. అదేవిధంగా  తన సొంత నిధులతో కూకట్పల్లిలోని 9 డివిజన్లో ఒక్కొక్క డివిజన్కు10 క్వింటాళ్ల బియ్యం.. క్వింట కందిపప్పు ..నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందని.. ఇదే స్ఫూర్తితో మా కార్పొరేటర్లు.. డివిజన్ ఇంచార్జిలు.. అధ్యక్షులు ..కార్యకర్తలు అభిమానులు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అని.. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు .. పారిశుధ్య కార్మికులకు ..వైద్యులకు అదనపు జీతాలు ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి కి రాని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రావడం ... ఆయనలోని  మానవీయ కోణాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు..నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా శవరాజకీయాలు చేసేవారిని అసలు పట్టించుకోవద్దు అని ముఖ్యమంత్రి గారి సూచించినట్లుగా మనందరం నిరుపేదలకు అండగా ఉండాలని కూకట్పల్లి నియోజకవర్గం లోని కార్యకర్తలకు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.

Post Top Ad