నా ప్రచారం వినూత్నం, విభిన్నం.....: కరోనాపై అవగాహనకి కొత్త అవతారం ఎత్తిన యువకుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 26, 2020

నా ప్రచారం వినూత్నం, విభిన్నం.....: కరోనాపై అవగాహనకి కొత్త అవతారం ఎత్తిన యువకుడు

శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - కూకట్ పల్లి) :  కరోనాను నివారించేందుకు పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కళాకారులు తమ పాటు ద్వారా.. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ పోస్టులు.. ఇన్స్టాలో పిక్చర్స్.. పేసుబుక్ లో వీడియోలు అప్లోడ్ చేస్తు ప్రజలకు అవగాహన కలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన తరహాలో ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ నా ప్రచారం వినూత్నం, విభిన్నం అంటున్నారు కూకట్ పల్లి  కి చెందిన నూకాజీ. బి.కామ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసికున్న ఇతగాడు దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న సందర్భంలో
తనదైన శైలిలో రకరకాల గెటప్సలో ప్రజలకు అవగాహన కలిపిస్తుంటారు. కళల పట్ల మక్కువతో ఈ రకమైన నూతన ప్రచారాన్ని జీవనాధారంగా ఎంచుకున్నాడు.

గతంలో పెద్ద నోట్లు రద్దు సమయంలో కూడా ఇలానే కొత్త రకంగా ప్రచారం చేయడమే కాకుండా పేటియం ద్వారా విరాళం సేకరించారు. ప్రతి ఆదివారం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నెక్స్ట్ రోడ్డులో వివిధ రకాల వేషధారణలతో ప్రజలను ఆకర్షస్తున్నాడు. మరి నుకాజీకి డబ్బులెలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా...? ఇక్కడే ఉంది ఓ జిమ్మిక్కు.
నూకాజీతో సెల్ఫ్ దిగాలంటే పేటియం ద్వారా డబ్బులు చెల్లించాలసిందే. ఒక్కడొక ఆఫర్ కూడా ఉందండోయ్.. సాధారణంగా కొన్ని వ్యాపార సంస్థలు మొదటి సర్వీస్ ఫ్రీ గా ఇచ్చినట్లుగానే నూకాజీ సైతం ఫస్ట్ సెల్ఫీ ఫ్రీ గా ఇస్తాడు. తర్వాత సెల్ఫీ మాత్రం పేటియం చేయాల్సిందే.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురుచేస్తుంటే, ప్రజలకు అవగాహన కలిపించేందుకు విచిత్రమైన వేషధారణలతో చేతిలో మైకు, మోఖానికి దెయ్యం లాంటి మాస్క్, మెడలో కరోనా డెవిల్ అంటూ ఒక ప్రచార ట్యాగ్ ని ధరించి కూకట్పల్లి మెయిన్రో డ్ లో తిరుగుతూ...కరోనా పట్ల అవగాహన లేకుండా కూకట్పల్లి లో అనవసరంగా రోడ్ల పైకి వస్తున్న వారిని నూకాజీ విచిత్ర, విభిన్న, ప్రచారాశైలి ఆకర్షిస్తోంది. దీంతో కొందరైనా మారకపోతారా అనేదే అతగాడి ఆలోచన..ఏది ఏమైనా కరోనాను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు నూకాజీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాలి.