హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న విషాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి గ్రామంలో పిడుగుపడి పెద్దపెళ్లి రాజయ్య(56) అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా దోమ మండలం బొంపల్లిలో కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు చనిపోయాడు. నూతన భవనానికి పైపుతో నీళ్లు కొడుతుండగా హైటెన్షన్ తీగలపై నీళ్లు పడటంతో ప్రమాదానికి గురై మృతిచెందాడు.