శ్రీ సేవా మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బట్టర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 27, 2020

శ్రీ సేవా మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వలస కార్మికులకు బట్టర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణి

కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీకి
ఎదురుగా ఉన్న వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న వలస కార్మికులకు శ్రీ సేవా మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బట్టర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. దీంతో
కరీంనగర్ పట్టణంలోని అనేక ప్రాంతాల్లో శ్రీ సేవా మార్గ ద్వారా వలస కార్మికులకు నిత్యవసర వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. క్లిష్ట సమయాల్లో పేదలకు తమ సంస్థ సేవలు
కొనసాగుతాయని ఫణిత అన్నారు.

Post Top Ad