మందు దొరకక మందుబాబు రోడ్డు మీద హల్చల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

మందు దొరకక మందుబాబు రోడ్డు మీద హల్చల్

కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 23వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రకటించింది. అయితే ఆ రోజు నుండి మందుబాబులకు ఊహించని విధంగా షాక్ తగిలింది, తాజాగా మైలార్ దేవ్ పల్లిలో మందు దొరకక మందుబాబు రోడ్డుమీద హల్చల్ చేశాడు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో
ఇప్పటివరకు 40 కేసులు పైగా మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న వారిని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. తాజాగా మైలార్ దేవ్ పల్లి ప్రధాన రహదారిపై ఆసిఫ్ నగర్ కి చెందిన గోపాల్ అనే వ్యక్తి మద్యం దొరకక వింత వింత చేష్టలు చేస్తూ రోడ్డు మీద ఉన్న వారిని ఒక్కసారిగా భయాందోళనకు
గురి చేస్తున్నాడు. మరి ఇన్ని రోజులు మద్యం దొరకకపోతే ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Post Top Ad