జర్నలిస్టులకు సరుకులను పంపిణి చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

జర్నలిస్టులకు సరుకులను పంపిణి చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్, 2020 - తెలంగాణ ప్రాంతీయం) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి జర్నలిస్టులు సైతం తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పత్తి రాకేష్ కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులను ఈ రోజు పంపిణీ చేశారు. దాదాపు 25 మంది జర్నలిస్టులకు 5 కేజీల బియ్యంతో పాటు కందిపప్పు, టామోటా, ఆలుగడ్డ, చింతపండు, కారం, అల్లం లాంటి సరుకులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి రేణుక, పత్తి రంగనాయకులు, పత్తి శృతి కీర్తి, రాధిక ప్రణీత్, పత్తి రజిని, గడ్డం సాయి కిరణ్, కిషోర్, శ్రీనివాస్, బోడ అనిల్, చంద్ర, దేవేందర్ సింగ్ పాల్గొన్నారు.

Post Top Ad