నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన: తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన: తెలంగాణ ప్రభుత్వం

               
శుభ తెలంగాణ (21ఏప్రిల్ 20)కరోనా లాక్  డౌన్
కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలకు నిత్యావసర సరుకులను డా.ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పావని మణిపాల్ రెడ్డి డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు చామకూర మల్లారెడ్డి మరియు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి గార్లు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రజా ప్రతినిధులు పూనుకోవడం మంచి పరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలి పస్తులతో పడుకోకూడదు అన్న సీఎం కేసీఆర్ గారి సూచన  మేరకు తామంతా ముందుకు వచ్చి తమ శక్తిమేరకు కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ రెడ్డి, కాప్రా ఎమ్మార్వో గౌతమ్,  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు,టి ఆర్ ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షుడు బేతాళ బాలరాజ్, సురేందర్,  సీనియర్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, షేర్ మన్నెమ్మ లక్ష్మీనారాయణ పెద్దాపురం కుమారస్వామి రామతులసి గోవర్ధన్ మట్ట రాజేశ్వర్ రెడ్డి  సింగం రాజు సీతారాం రెడ్డి బాల్ నరసింహ విల్సన్ సురేంద్రచారి యాకయ్య శ్రీనివాస్‌గౌడ్ రాజిరెడ్డి కాలనీ అధ్యక్షులు తిరుమలయ్య కమిటీ సభ్యులు అనుపురం కమిటీ అధ్యక్షులు జైపాల్‌రెడ్డి మనిమోహన్దాస్ విజయేందర్‌రెడ్డి SL GROUP సభ్యులు ఉప్పలయ్య బాల్‌రెడ్డి, గోలి శ్రీనివాస్   తదితరులు పాల్గొన్నారు