అవినీతికి అడ్డుకట్ట వేస్తూ మాంసం ధరలను ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

అవినీతికి అడ్డుకట్ట వేస్తూ మాంసం ధరలను ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

6

తెలంగాణ :  కరోనా కారణంగా ప్రమొదట్లో చికెన్, మటన్ తింటే కరోనా వస్తుందని ప్రచారం జరిగినా ఆ తరువాత నాన్‌వెజ్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాలు చెప్పడంతో ప్రజలు మళ్ళీ నాన్‌వెజ్‌ని తెగ తింటున్నారు.. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇకపోతే కొన్ని చోట్ల కల్తీ మాంసాన్ని విక్రయిస్తుండడం, తూనీకలలో మోసాలు చేస్తుండడం గమనించిన ప్రభుత్వం మటన్ ధరలను ఫిక్స్ చేస్తూ యజమానులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ఏ షాపులోనైనా మటన్ 700 రూపాయలకే అమ్మాలని, ప్రతి షాపు ముందు మటర్ ధర కనిపించేలా బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించి మాంసాన్ని అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలను ఈ ధరలకు మించి ఎవరైనా అమ్మితే ప్రభుత్వానికి తెలియచేయని అని విన్నవించింది .