మద్యం దానం చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

మద్యం దానం చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు ...

శుభ తెలంగాణ( హైదరాబాదు) : కరోనా వైరుస్ కట్టడి కోసం రాష్ట్రంలో లాక్ డౌన్ ను చాలాప కడ్బంధీగా అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైనవి మినహా అన్ని రకాల షాపులు, దుకాణాలు మూసేశారు. మందు షాపులు కూడా బంద్ చేశారు. లాక్ డౌన్ తో నిరుపేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వారి ఆకలి తీర్చేందుకు అన్నదానాలు జరుగుతున్నాయి. అందరూ అన్నదానాలు చేస్తుంటే ఓ వ్యక్తి మాత్రం మద్యం దానం చేశాడు. ఆ వ్యక్తి చేసిన దానం మాత్రం విమర్శలకు  దారి తీసింది. ఆ వ్యక్తిని జైలు పాలు చేసింది. లాక్ డౌన్ లో మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న మందు బాబులకు మందు దాహం తీర్చాడు ఆ వ్యక్తి. హైదరాబాద్ పాతబస్తీ చంపాపేటలో ఈ ఘటన జరిగింది. చంపాపేటలో వైన్స్ షాపుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు మద్యం దుకాణాలు తెరుస్తారని ఎదురుచూస్తున్న మందు బాబులకు కుమార్ అనే స్థానికుడు మందు దానం చేశాడు. ఒక్కో మనిషికి ఓక్కో పెగ్గు పోసి వారి మందు దాహాన్ని తీర్చాడు. కుమార్ చేసిన దానం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. దీన్ని తీవ్రంగా తప్పుపట్టిన పోలీసులు కుమార్ ను అరెస్ట్ చేశారు. కుమార్ పై సెక్షన్ 34 ఏ ఆఫ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా సరే సరదాగా, కాలక్షేపం కొరకు నిబంధనలు దిక్కరిస్తే కటకటాల్లోకి వెళ్లాల్సివస్తుందని.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Post Top Ad