ఈ నంబర్ కు కాల్ చేస్తే ఆకలి తీరుస్తారు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 25, 2020

ఈ నంబర్ కు కాల్ చేస్తే ఆకలి తీరుస్తారు....

తెలంగాణలో కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం లాక్ డౌన్
కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మంది వలస కూలీలు, అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా చూసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఐతే
జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకుంటే 040- 21111111కి ఫోన్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఫోన్ నంబర్ ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు.లాక్ డౌన్ కాలంలో పేదలు, అభాగ్యులు అన్నం దొరకక ఇబ్బంది పడుతున్నారని.


వారందరికి కడుపు నిండా భోజనం పెట్టే బాధ్యత అందరి పై ఉందని ఆమె అన్నారు. ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదు నీ అంతా
 సంతోషంగా ఉండాలని అన్నారు. 

ఈ నంబర్ ను అందరికి తెలియజేసి ఆకలి  తీర్చాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టరేట్ నంబర్లకు ఫోన్ చేసి అందరి ఆకలి తీర్చవచ్చని అధికారులు తెలిపారు.