హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో జీవిత ఖైదీ మృతి........ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో జీవిత ఖైదీ మృతి........

చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ
గుండెపోటుతో మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు.ఉత్తరప్రదేశ్ లోని అరాక్ జిల్లాకు చెందినవాజీద్ అలీకి మార్చి 31 మధ్యాహ్నాం సమయంలో గుండెపోటు రావడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అలీ మృతిచెందాడు. వాస్తవానికి వాజీద్ అలీ ఉపాధి కోసం నగరానికి వచ్చి.. జహీరాబరా లో కూలీ పనులు చేసుకునే వాడని అధికారులు చెప్పారు. ఏడాది క్రితం బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా
వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో పెట్టినట్టు జైలర్ రామకృష్ణ తెలిపారు.

Post Top Ad