ఎస్.ఆర్.డీ.పీ పనులను పరిశీలించిన నగర మేయర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

ఎస్.ఆర్.డీ.పీ పనులను పరిశీలించిన నగర మేయర్

శుభతెలంగాణ న్యూస్:హైదరాబాద్ ఎస్.ఆర్.డీ.పీ పనుల్లో భాగంగా లింగోజిగూడ డివిజన్ పరిధిలోని మాల్ మైసమ్మ దేవాలయం వద్ద పనులను జీ.హెచ్.ఏం.సీ మేయర్ బొంతు రామ్మోహన్, లింగోజిగూడా డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ చేర్మెన్ గుంటి లక్ష్మణ్ మరియు పలువురు మున్సిపల్ ఉన్నత అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చే వాహనాల రద్దీ తగ్గిన నేపథ్యంలో ఎల్.బి.నగర్ కూడలి వద్ద ఎడమ వైపు ఫ్లె ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేశామని పేర్కొన్నారు. దీంతో ఎల్.బి.నగర్ మాల్ మైసమ్మ దేవాలయం వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కారం చేసి, యుద్ధ ప్రాతిపదికన ఫ్లె ఓవర్ పనులకు శ్రీకారం చుట్టామని మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్ క్షేత్ర స్థాయి పర్యటన సందర్భంగా వెల్లడించారు.

Post Top Ad