తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరుణ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరుణ కేసులు

తెలంగాణలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 453కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం 397 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారందరికి కూడా గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన 11 మంది కూడా మర్కజ్ వెళ్లిచ్చిన వారు. ప్రస్తుతం ఉన్న బాధితులంతా క్షేమంగా
ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ లో అత్యధికంగా 182 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 39 కేసులు నమోదయ్యా యి. తెలంగాణలో ఈ రెండు జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా - 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 4, హైదరాబాద్ - 182, జగిత్యాల - 3, జనగాం - 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -2, జోగులాంబ గద్వాల జిల్లా- 22, కామారెడ్డి జిల్లా - 10, కరీంనగర్ -18, మహబూబాబాద్ జిల్లా - 1, మహబూబ్ నగర్ -11, మెదక్ - 5, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా - 20, ములుగు-2, నాగర్ కర్నూల్ - 2,
నల్గొండ- 14, నిర్మల్ -10 నిజామాబాద్ - 39  ,పెద్దపల్లి- 2, రంగారెడ్డి - 34 , సంగారెడ్డి -7, సిద్దిపేట - 1, సూర్యాపేట -9, వరంగల్ అర్బన్ - 24,  వికారాబాద్ - 5 కేసులు నమోదయ్యాయి.

Post Top Ad