కరోనా వైరస్ ను నివారించడం మన అందరి సామాజిక బాధ్యత - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

కరోనా వైరస్ ను నివారించడం మన అందరి సామాజిక బాధ్యత

కరోనా వైరస్ ను నివారించడం మన అందరి సామాజిక బాధ్యత అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా అనుమానితుల గురించి స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

దగ్గు,జలుబు, జ్వరంతో బాధపడే వాళ్లను స్థానికంగా
ఉండే కాలనీ, అపార్టుమెంట్ సంక్షేమ సంఘాలు గుర్తించే బాధ్యత తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ల ఆరోగ్యం గురించి సంక్షేమ సంఘాలు తెలుసుకోవాలని డీజీపీ కోరారు. హైదరాబాద్ నగరంలో చౌకధర దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటిస్తుండటం సంతోషకరమని డీజీపీ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్న పోలీసులను ఆయన అభినందించారు.
ప్రజలను కరోనా వైరస్ బారిన పడకుండా చూసేందుకు ముందు వరుసలో ఉంటున్న పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని మహేందర్ రెడ్డి సూచించారు.

Post Top Ad