తుర్కపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

తుర్కపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖలైన వైద్య, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖలతో డిల్లీలోని మార్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి కి కరోనా పాజిటివ్ వచ్చినందున ప్రైమరీ కాంటాక్టును తక్షణమే యన్టిఆర్థి కి
పంపించాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి ఒక కిలో మీటర్ విస్తీర్ణంలో ఉన్న అందరి ఇండ్లలో సమగ్ర సర్వే చేయడానికి ఏర్పాటు చేసిన బృందాలతో ఆయన సమీక్షించారు. ఇంటి ఇంటికి తిరిగి సర్వే చేస్తున్న ఆశా, అంగన్ వాడి, వైద్య సిబ్బందిని, పారిశుద్ధ్య, కార్మికులను అభినందించారు.. ఈ పర్యటన లో అడిషనల్ కలెక్టర్
విద్యాసాగర్, ఆర్డీఓ రవి, తహిసిల్దార్ గోవర్ధన్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad