రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఇళ్ల‌లోనే జ‌రుపుకోండి:కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఇళ్ల‌లోనే జ‌రుపుకోండి:కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ....

శుభతెలంగాణ(న్యూఢిల్లీ)ఏప్రిల్ 24 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండ‌డంతో.. ముస్లిం సోద‌రులంతా ఈ ఏడాది ప్రార్థనలను, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు.కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.కరోనా సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్‌డౌన్ నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్ఫ్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఆయన కోరిన‌ట్లు చెప్పారు. వారితో తాను స్వయంగా మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు.
ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలను, ఇఫ్తార్ విందుల‌ను జరుపుకునేలా చూడాల‌ని వారిని కోరిన‌ట్లు తెలిపారు.సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా మసీదులు మరియు మతానికి సంబంధించిన‌ ప్రదేశాలలో జరిగే కార్యక్రమాలను కూడా నిషేధించాయని నఖ్వీ ఈ సంద‌ర్భంగా తెలిపారు.ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందువల్ల అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు.

Post Top Ad