హాస్పిటల్ సిబంది నిర్లక్ష్యం : బాలింత మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

హాస్పిటల్ సిబంది నిర్లక్ష్యం : బాలింత మృతి


శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - వనస్థలిపురం ) : వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రక్తం ఎక్కించే సదుపాయం లేక పోవడంతో బాలింత మృతి చెందింది. ఖమ్మం జిల్లా ములుగుకు చెందిన లెక్చరర్ సతీష్ భార్య విజయ హయాత్ నగర్ లోని తల్లిదండ్రుల వద్దవుంటూ కాన్పుకోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి రాగా సాధారణ ప్రసవం జరిగి మొగ బిడ్డ కు  జన్మనిచ్చింది.

విజయకు అధిక రక్తస్రావం కావడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో రక్తం ఇచ్చే సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ కి పంపించగా రక్తస్రావం అధికమై దారిలోనే మరణించింది. ఏరియా హాస్పిటల్ సిబంది  నిర్లక్ష్యం వలనే విజయ చనిపోయింది అంటూ భర్త సతీష్ ఆరోపిస్తున్నారు. ముందుగా హాస్పిటల్ సిబ్బంది రక్తం అవసరం పడుతుంది అని చెప్పలేదని ఒకవేళ అలా చెప్పి ఉంటే ఈ ఘటన జరగపోయేది అని భర్త సతీష్ అన్నారు. హాస్పిటల్ ఆర్.ఎం.ఓ మాత్రం విజయకు జాండీస్ ఉన్నాయి.. జ్వరం కూడా ఉంది అని చెప్తున్నారు. బాలింత మృతితో బిడ్డ  తల్లి ప్రేమకు దూరమయ్యాడు.