COVID - 19 స్పెషల్ టీం తో పలు సమస్యలపై చర్చించిన MLA డాక్టర్ మెతుకు ఆనంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

COVID - 19 స్పెషల్ టీం తో పలు సమస్యలపై చర్చించిన MLA డాక్టర్ మెతుకు ఆనంద్...

శుభ తెలంగాణ(22ఏప్రిల్ 20)వికారాబాద్  జిల్లా లో   ఈ రోజు వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రేటరీ సోమేశ్ కుమార్ గారు, DGP మహేందర్ రెడ్డి గారు, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతకుమారి గారు, ప్రత్యేక అధికారి రజత్ కుమార్ శైని గార్లను కలిసి వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు.

నియోజకవర్గంలో ఉన్న వలస కార్మికులకు, రేషన్ కార్డు లేని పేదలకు అందరికి రేషన్ తో పాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అందించాలి అని తెలిపారు.

జిల్లా లో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నారు అని, వేరే మండలాల నుండి సిబ్బందిని పట్టణం లో డెప్యూట్ చేయడం వల్ల మండలాలలో సమస్యలు అధికం అవుతున్నాయి అని కావున సిబ్బందిని నియమించాలి అని, పట్టణం లో కొరోన అనుమానితులు ఇంకా ఉన్నారు అని వారిని వెంటనే గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలి అని DGP గారికి తెలిపారు.

వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 31 వికారాబాద్ పట్టణం లో ఉన్నాయి అని కావున COVID-19 పరీక్షలు ఇంకా ఎక్కువ మందికి చేయాలి అని వైద్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శాంతకుమారి గారికి తెలిపారు.

Post Top Ad