కొరోన కట్టడికి స్వీయనిర్బంధమే ఏకైక మార్గం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

కొరోన కట్టడికి స్వీయనిర్బంధమే ఏకైక మార్గం - వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్


ఈరోజు వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొరోన వైరస్ కట్టడికై ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించిన సంధర్బంగా గ్రామాల్లో తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వ పథకాల అమలును, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించడానికి వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం లోని పలు గ్రామాల్లో ఎంపీపీ బట్టు లలిత, ZPTC మధుకర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో, స్థానిక సర్పంచ్ లు, MPTC లతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. తరువాత మర్పల్లి MPDO కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

1). రావులపల్లి :-

మర్పల్లి మండలం లోని రావులపల్లి గ్రామంలో  గ్రామం లోని ప్రజలకు కొరోన వైరస్ నిర్ములనకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై వారికి అవగాహన కల్పించారు.

2). తిమ్మాపూర్ :-

మర్పల్లి మండలం లోని తిమ్మాపూర్ గ్రామం లో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఉపాధిహామీ పనిలో కూలీలు భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి అని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అన్నారు. కూలీలకు మాస్క్ లు పంపిణీ చేశారు.

3). పెద్దపూర్:-

పెద్దపూర్ గ్రామం లో పర్యటించి స్థానికంగా జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. గ్రామపంచాయితి లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు  శాలువా కప్పి సన్మానం చేశారు.

4). కోట్ మర్పల్లి:-

మర్పల్లి మండలం లోని కోట్ మర్పల్లి గ్రామం లో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ముస్లిం సోదరులు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి అన్నారు.

మర్పల్లి MPDO కార్యాలయం లో సమీక్షా సమావేశం:-

వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మర్పల్లి మండలకేంద్రం లోని MPDO కార్యాలయంలో లైబ్రరీ చైర్మన్ కొండల్ రెడ్డి గారు, RDO ఉపేందర్ రెడ్డి గారు, MPP భట్టు లలిత గారు, ZPTC మధుకర్ గారు, MRO తులసీరాం గారు, MPDO సురేష్ బాబు గారు, AO వసుంధర గారు, MPO స్వామి గారు, SI, APO, APM, పట్లోర్ PHC డాక్టర్ కృష్ణ, మర్పల్లి PHC డాక్టర్ శ్రీనివాస్, ఇతరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు రైతులు పండించే పంటను చివరి గింజ వరకు కొనాలి అని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొరోన వైరస్ నియంత్రణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తూచా తప్పకుండా అమలు చేయాలి అన్నారు.

ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలు ఫిజికల్ డిస్టెన్స్ పాటించి, మాస్క్ లు, ధరించేలా EGS అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. 

లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఆకలితో అలమటిoచకుండా వారికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలి అన్నారు.