కూకట్ పల్లి దీనబందు కాలనీ మరుమాముల మల్లేష్, MRPS, నాయుడు ఆధ్వర్యంలో ఆహార పంపిణీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

కూకట్ పల్లి దీనబందు కాలనీ మరుమాముల మల్లేష్, MRPS, నాయుడు ఆధ్వర్యంలో ఆహార పంపిణీ...

శుభ తెలంగాణన్యూస్(మేడ్చల్ జిల్లా)కోవిడ్ 19 హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కూకట్పలి  దీనబందు కాలనీలో డా రెడ్డి లాబ్స్, అక్షయ పాత్ర వారి సహకారంతో కోవిడ్ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో 600 మందికి ఆహారం పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కోవిడ్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ మాట్లాడుతూ గత మార్చి 28 నుండి ఇప్పటివరకు కూకట్పలి ప్రశాంత్ నగర్ లోని ఇందిరా నగర్లో ఉదయం 2500మందికి, సాయంత్రం 2500మందికి, జగత్గిరిగుట్ట రాజీవ్ గ్రుహకల్పలో 1500 వందల మందికి, రిక్షా పుల్లర్స్ కాలనీ,బాలయ్య బస్తిలో 1000 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నామని, లాక్డౌన్ ఎత్తి వేసేవరకు ఆహారం అందించే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వం కూడా మా ఈ కార్యక్రమంకు సహకరిస్తుందని తెలియజేసారు. మార్చి 28 నుండి ఈ రోజు వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  కోవిడ్ హెల్ప్ డెస్క్ ఆధ్వర్యంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల 3,25,00 మందికి ఆహారం పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లేష్, సాలయ్య, బస్తీ నాయకులు పాల్గొన్నారు.

Post Top Ad