ఇందులో భాగంగా ఇంటితోపాటు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తలో నిల్వ ఉన్న నీటితోపాటు, పూల కుండీలను శుభ్రం చేశారు. దీంతోపాటు ప్రగతిభవన్‌లోని గార్డెన్ వంటి ఏరియాల్లో ఎక్కడైనా వాన నీరు పేరుకుపోయిందేమో అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమం నిరంతరం పది వారాల పాటు కొనసాగించాలని ప్రజలను కోరారు. ప్రతి వారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటిఅర్ప్రతి ఆదివారం తన ఇంటి చుట్టూ ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. తన ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలను కాపాడుకుంటూ చుట్టూ నీరు నిల్వ లేకుండా శుభ్రం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో ఈ వారం కూడా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.