హైదరాబాద్‌లో చిరుత కలకలం.. 15 రోజులుగా ఇక్కడే! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

హైదరాబాద్‌లో చిరుత కలకలం.. 15 రోజులుగా ఇక్కడే!

హైదరాబాద్ శివారులో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. గురువారం రాత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీ సీసీ కెమెరాల్లో చిరుత కనిపించింది. అక్కడి నుంచి గగన్ పహాడ్ గుట్టల్లోని ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లినట్లు చిరుత ఆనవాళ్లు లభ్యమయ్యాయి. పాద ముద్రల ఆధారంగా చిరుత అడవిలోని చెరువు దగ్గరకి వెళ్లి నీళ్లు తాగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుతను పట్టుకోవడం కోసం అటవీ, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు.
చిరుతను పట్టుకోవడం కోసం ఫారెస్ట్ టీం 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. గతంలో గగన్‌పహాడ్ రైల్వే బ్రిడ్జి కింద నుంచి తప్పించుకున్న ప్రదేశం నుంచి ఇప్పుడు చిరుత తిరుగుతున్న ప్రదేశం రెండు కిలో మీటర్ల దూరంలోనే ఉంది. 15 రోజులుగా చిరుత పులి ఇక్కడిక్కడే తిరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

రెండు వారాల క్రితం చిరుత పులి కాటేదాన్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జి వద్ద నడి రోడ్డు మీద కనిపించింది. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని పక్కన ఉన్న ఫామ్‌హౌస్‌లోకి పారిపోయింది. అక్కడి నుంచి హిమాయత్ సాగర్‌ వైపు పారిపోయింది.