తెలంగాణ లో రేపటి నుండే మద్యం అమ్మకాలు ప్రారంభం : 16 శాతం వరకు రేటు పెంపు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

తెలంగాణ లో రేపటి నుండే మద్యం అమ్మకాలు ప్రారంభం : 16 శాతం వరకు రేటు పెంపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోన కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లక్డౌన్ లో పలు విషయాలు , సడలింపు లపై  సీఎం అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమై , అనంతరం సీఎం కేసీఆర్ పలు విషయాలు వెల్లడించాడు .కంటైన్‌మెంట్ జోన్‌లో వున్న ఆ 15 షాపులు మినహా మిగతా అన్ని చోట్ల షాపులు తెరవడానికి తెలంగాణా ప్రభుత్వం అనుమతించింది. 16 శాతం ధర పెంచుకోవడానికి క్యాబినెట్ నిర్ణయించింది. చీప్‌లిక్కర్ మీద 11 శాతం పెంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. చుట్టూ వున్న నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాషాలు తెరిచారు. ఆంధ్రప్రదేశ్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దు వుంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ప్రారంభించకపోతే మద్యం స్మగ్లింగ్ పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రేపటి నుంచి తెలంగాణాలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు సి.ఎం. ప్రకటించారు.  మద్యం షాపుల వద్ద భౌతికదూరం పాటించాల్సిందే. నిబంధనలు అమలు చేయకపోతే మద్యం షాపుల్ని మూసివేస్తాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరిచి వుంటాయి. షాప్ ఓనర్లు క్రమశిక్షణ పాటించాలి. శానిటైజర్ పెట్టాలి. మాస్క్ లేకపోతే మద్యం ఇవ్వవద్దు. మాస్క్ లేకపోతే కిరాణా షాపుల్లో కూడా నిత్యావసర వస్తువులు ఇవ్వవద్దని సి.ఎం ఆదేశించారు.

Post Top Ad