శుభ తెలంగాణ(౩, ఏప్రిల్ , 2020 - అంతర్జాతీయం, ) : : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 34 లక్షల 81 వేల 465 మంది ఈ వైరస్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 21 లక్షల 28 వేల 410. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 44 వేల 666 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 11 లక్షల 8 వేల 389 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాలో 67,444 మంది చనిపోగా స్పెయిన్లో 25,100, ఇటలీ-28,710, యూకే-28,131, ఫ్రాన్స్-24,760, జర్మనీ-6,812, టర్కీ-3,336, రష్యా-1,222, బ్రెజిల్-6,750, ఇరాన్-6,156, చైనా-4,633, కెనడా-3,566, బెల్జియం-7,765, పెరూ-1,200, నెదర్లాండ్స్-4,987, స్విట్జర్లాండ్-1,762, ఈక్వెడార్-1,371, పోర్చుగల్-1,023, స్విడన్-2,669, ఐర్లాండ్-1,286, మెక్సికోలో 1,972 మంది చనిపోయారు.
Post Top Ad
Sunday, May 03, 2020
Home
అంతర్జాతీయం
దేశాలన్నీ లక్డౌన్లో ఉన్న ఆగని కరోనా మృత్యుగోష : 2 లక్షల 44 వేల మందికి పైగా మృత్యువాత
దేశాలన్నీ లక్డౌన్లో ఉన్న ఆగని కరోనా మృత్యుగోష : 2 లక్షల 44 వేల మందికి పైగా మృత్యువాత
Admin Details
Subha Telangana News