తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ : కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ : కొత్తగా 21 పాజిటివ్ కేసులు నమోదు

5

తెలంగాణ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలోతెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతుండగా..మరో రోజులో డబుల్ డిజిట్స్ కు కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానంగా GHMC పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం గమనార్హం. 2020, మే 03వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు మరో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో 20, జగిత్యాల జిల్లాలో ఒకటి నమోదైంది. శనివారం నాటికి జగిత్యాల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఆదివారం ఒక కేసు నమోదు కావడం జిల్లాల వాసులు భయాందోనళలకు గురవుతున్నారు. ఇటీవలే ముంబై వచ్చిన 65 సంవత్సరాలు కలిగిన వృద్ధుడు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్లు గుర్తించారు. ఇతడిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసపత్రుల్లో 508 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 2020, మే 03వ తేదీ ఆదివారం 46 మంది డిశ్చార్జ అయి..ఇంటికి వెళ్లారు. మొత్తంగా చికిత్స పొంది ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 545కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 మంది చనిపోయారు. రెండు వారాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాల్లో తాజాగా వికారాబాద్, నల్లగొండ జిల్లాలు చేరాయి. ఆ జాబితాలో మొత్తం జిల్లాల సంఖ్య 17కు చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు : 1082 చికిత్స పొందుతున్న వారు : 508 డిశ్చార్జ్ అయిన వారు : 545 మృతి చెందిన వారి సంఖ్య : 29