రానున్న 24 గంటల్లో తెలంగాణ లో భారీ వర్షాలు : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తనం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

రానున్న 24 గంటల్లో తెలంగాణ లో భారీ వర్షాలు : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తనం


తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ : దక్షిణ అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఈనెల 10 లేదా 11న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలునమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Post Top Ad