దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ : కొత్తగా 2,411 పాజిటివ్‌ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ : కొత్తగా 2,411 పాజిటివ్‌ కేసులు

4
జాతీయం (న్యూ ఢిల్లీ )  : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో,  భారత్ లో కరోనా నిర్థారణకు చేస్తున్న ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు శనివారం సాయంత్రానికి 10 లక్షల మైలురాయిని దాటాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. శనివారం సాయంత్రం వరకు సుమారు 10,40000 పరీక్షలను పరీక్షలు జరిపామని.. కొద్ది రోజుల్లోనే కరోనా టెస్టుల సంఖ్య బాగా పెంచామని అన్నారు. గత రెండు రోజులు కూడా రోజుకి దాదాపు ఐసిఎంఆర్ 70,000 పరీక్షలు చేస్తోందని తెలిపారు. ఏపిల్ చివరి నాటికి 9,76,363 టెస్టులు చేయగా.. మే 1 నుంచి శనివారం సాయంత్రం వరకు 1,37,346 పరీక్షలు జరిపించామని తెలిపింది మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ రాష్టాలు పరీక్షలు ఎక్కువగా జరుపుతున్న జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయని.. ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాలు కూడా లక్షకు పైగా పరీక్షలు నిర్వహించాయని ఐసిఎంఆర్ తెలిపింది. అటు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ కూడా టెస్టులు ఎక్కువగా జరుపుతున్నప్పటికీ.. అవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది.24 గంటల్లో కరోనాతో 71 మంది కన్నుమూశారు. కొత్తగా 2,411 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,223కు, పాజిటివ్‌ కేసులు 37,776కు ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసులు 26,565 కాగా, 10,017 మంది బాధితులు చికిత్సతో కోలుకొని ఇళ్లకు చేరారు. అంటే రికవరీ రేటు 26.52 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోంది. దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం ఇప్పటిదాకా 10.40 లక్షల ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.