శుభ తెలంగాణ(1, ఏప్రిల్ , 2020) : కన్నతల్లి పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్ బాబు ఆధ్వర్యంలో కరీమాబాద్ 23 వ డివిజన్ లో దాసరి వాడ, వడ్డర వాడ, పూసవర్ల వీధి సుమారు 250 ప్రజలకు మాంసాహారంతో కూడిన బోజనము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా ఇలాంటి సమయంలో పేద ప్రజలకు సహాయం చేయడానికి బయటికి వచ్చి సహాయం చేస్తున్నటువంటి వీరి సేవలు అమోఘం అని అన్నారు. ప్రజలందరూ ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎంతో కష్టపడి కన్నతల్లి పౌండేషన్ రాజన్ బాబు మొదటినుండి కష్టపడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారు. పేద ప్రజలకు అన్నదాన ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, కుడా డైరెక్టర్ మోడం ప్రవీణ్, వడ్లనాల నరేందర్, మేడిది మధుసూదన్, ఓగిలి శెట్టి అనిల్ కుమార్, కొండమీది రాజు, అరుణ్ కుమార్, బత్తిని అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, May 01, 2020
250 మందికి మాంసాహారంతో కూడిన భోజనం ఏర్పాటు
Admin Details
Subha Telangana News