తెలంగాణలో మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : 29 మంది బలి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

తెలంగాణలో మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : 29 మంది బలి

10875_adobestock_323337524_921330_crop
తెలంగాణ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగానిన్న ఒక్క రోజే 17 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు.. కరోనాతో ఒకరు మృత్యువాత పడటం మళ్లీ కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 29కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే..ప్రధానంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతుండడంతో అధికారులు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక 5వ తేదీన నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.