సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్: కీలక విషయాలు వెల్లడి .. కేంద్రంపై తీవ్ర విమర్శలు ...లాక్ డౌన్ 29 వరకు పొడిగింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్: కీలక విషయాలు వెల్లడి .. కేంద్రంపై తీవ్ర విమర్శలు ...లాక్ డౌన్ 29 వరకు పొడిగింపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోన కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లక్డౌన్ లో పలు విషయాలు , సడలింపు లపై  సీఎం అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమై , అనంతరం సీఎం కేసీఆర్ కింది విషయాలు వెల్లడించారు .

👉 రాష్ట్రంలో లాక్ డౌన్ మే 29 వరకు పొడగింపు.
👉 లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలి.
👉 రాష్ట్రంలో 1096 కు చేరిన కరోనా భాదితులు...
👉 ఇవాళ కొత్తగా 11 మందికి పాజిటివ్.. 43 మంది డిశ్చార్జ్.
👉 రాష్ట్రంలో 439 యాక్టిివ్ కేసులు నమోదు.
👉 రేపటి నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్..
👉12 గంటలు మద్యం షాపులు ఓపెన్ ఉంటాయి.
👉 చీఫ్ లిక్కర్ పై 11 శాతం పెంపు.
👉 రెడ్ జోన్ లోను మద్యం షాపులు ఓపెన్.
👉 మిగతా అన్ని బ్రాండ్ల పై 16 శాతం పెంపు.
👉 హాట్ స్పాట్ లలో మాత్రమే లిక్కర్ షాప్ లు బందు.
👉 మాస్క్ లేకపోతే లిక్కర్ ఇవ్వబడదు.
👉వైన్ షాపుల వద్ద గుంపులు గుంపులుగా జనం ఎగబడ వద్దు.
👉 ప్రజలు సహకరించకపోతే మద్యం షాపులను వెంటనే క్లోజ్ చేస్తాం.
👉 సోషల్ డిస్టెన్స్ లేకపోతే వైన్ షాపులను క్లోజ్ చేస్తాం.
👉 అవసరం మేరకే కరోనా టెస్టులు చేస్తాము.
👉 కరీంనగర్ నుంచి దేశానికే రోల్ మోడల్ అయినం.
👉 సింగిల్ డెత్ లేకుండా కరీంనగర్ ను కాపాడుకున్నం.
👉 ఆగస్టు, సెప్టెంబర్ లో రాష్ట్రం నుంచే వచ్చే అవకాశం ఉంది.
👉 రాష్ట్రంలో కరోనా ను పకడ్బందీగా కట్టుబడి చేశాం.
👉 రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి... 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో  ఉన్నాయి... 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
👉 కొత్త కేసులని జీహెచ్ఎంసీ పరిధిలోని వస్తున్నాయి.
👉 కేంద్ర  సడలింపులు పాటించాల్సిందే.
👉 రెడ్ జోన్లలో 66% పాజిటివ్ కేసులు ఉన్నాయి.
👉 రాత్రిపూట కఠినమైన కర్ఫ్యూ కొనసాగుతుంది.
👉 రాష్ట్రంలో సరిపడా మాస్కులు, పిపిఈ కిట్లు తక్కువగా ఉన్నాయి.
👉 కొద్ది రోజులు ఓపిక పడితే మంచి ఫలితాలు.
👉 ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కైనా సిద్ధంగా ఉన్నాము.
👉 రెడ్ జోన్ లలో ఎట్టి పరిస్థితుల్లో షాపులు తెరవడానికి వీలులేదు.
👉 10 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చాము.
👉 27 జిల్లాల్లో అన్ని సడలింపులు.
👉 వ్యవసాయరంగ పనులు కొనసాగుతాయి.
👉 నిర్మాణ వ్యవసాయ సంబంధిత షాపులు తీయడానికి తీయడానికి ఓకే.
👉 6 రెడ్ జోన్ జిల్లాలలో ఎటువంటి సడలింపులు ఉండవు.
👉15వ తేదీన సమీక్ష నిర్వహించి సడలింపు లపై చర్చిస్తాం.
👉 గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో అన్ని షాపులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచబడతాయి.
👉 సోషల్ డిస్టెన్స్ లేకపోతే అన్ని క్లోస్ చేస్తాం.
👉 అన్ని ఆర్టిఏ ఆఫీసులో రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి.
👉 తెలంగాణ కన్నా చిన్న దేశాలు వందకు పైగా ఉన్నాయి.
👉 కోర్టు నిబంధనల ప్రకారం పదవతరగతి పరీక్షలు.
👉 తక్కువ మంది విద్యార్థులతో పరీక్ష కేంద్రాలు.
👉 మే నెలలో టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తాం.
👉 భూముల, అమ్మకాలు కొనుగోళ్లు జరుపుకోవచ్చు.
👉 రేపటి నుంచి ఇంటర్ పేపర్ వాల్యూవేషన్ కొనసాగుతుంది.
👉 కరోనా, మనం కలిసి బతకాల్సిందే.
👉 గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మండల కేంద్రాలు, గ్రామాల్లో సడలింపులు
👉 రాత్రిపూట కర్ఫ్యూ రాష్ట్రం మొత్తం ఉంటుంది.
👉 యువ న్యాయవాదులకు సాయం చేసేందుకు రూ.25 కోట్లు.
👉 తక్షణమే లాయర్లకు కు రూ.15 కోట్లు రిలీజ్.
👉 ఏడున్నర లక్షల మంది కార్మికులకు వసతులు కల్పించాo.
👉 వలస కూలీలు ఉంటే వారికి అన్ని వసతులను సమకూర్చుతాం.
👉 వలస కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్తామంటే పంపిస్తాం.
👉 ఏ రాష్ట్రంలో పంటలు కొనడం లేదు.
👉 తెలంగాణలో మాత్రమే పంటలు కొంటున్నాం.
👉7 వేలకుపైగా సెంటర్లలో ధాన్యం కొంటున్నం.
👉 ఈ విషయాన్ని విపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నాయి.
👉 తెలంగాణ లో ఉండేది రైతు రాజ్యం చిల్లర రాజకీయం కాదు.
👉 రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమే.
👉 వర్షాకాలంలో  రైతుబంధు పథకం కింద రైతులకు 7 వేల ఇస్తాం.
👉 పేదలకు పెన్షన్లు కొనసాగుతాయి.
👉 కెసిఆర్ ఉన్నంతవరకు రైతుబందు కొనసాగుతుంది.
👉 రుణమాఫీ కోసం రేపే 12 కోట్లు రిలీజ్ చేస్తాం.
👉 రూ 25 వేల లోపు ఉన్నవారికి  మాఫీ చేస్తాం.

ఇదే సమయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నల సమయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరి బాలేదని నిక్కచ్చిగా వెల్లడించారు . వలస కార్మికుల ప్రయాణ చార్జీల విషయంలో కూడా కేంద్ర వైఖరిని ఖండించారు . కేంద్రం తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదని వెల్లడించారు .