కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం


శుభ తెలంగాణ (08, మే , 2020 - జాతీయం) : పంజాబ్ లోని హోషియాపూర్ గ్రామంలో భారత వాయిసేనకు చెందిన మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. విమానం కూలిపోవడాన్ని గ్రహించిన పైలట్ పారాచూట్ ద్వారా కిందికి దూకేశాడు. దీంతో అతను గాయాలతో బయటపడ్డాడు. పైలట్ తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో అక్కడే ఉన్న సిక్కులు తమ విశ్వాసాన్ని పక్కకు పెట్టి వారి తలపాగా తీసి పైలట్ కు రక్షణగా కట్టారు. కాసేపటికి వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అక్కడికి చేరుకోవడంతో పైలట్ ను దాంట్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Post Top Ad