జూన్ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం.. అదే రోజు ప్రాజెక్టుల వద్ద ఒకరోజు దీక్షకు కాంగ్రెస్ పిలుపు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

జూన్ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం.. అదే రోజు ప్రాజెక్టుల వద్ద ఒకరోజు దీక్షకు కాంగ్రెస్ పిలుపు..

తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి ప్రాజెక్టుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీన వైఖరి తెలంగాణ సమాజానికి ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల సిద్దాంతంతో సాధించుకున్న తెలంగాణలో నీటి వనరుల దోపిడీ జరగకముందే ముందస్తు వ్యూహంగా వ్యవహరించాల్సిన అవశ్యకత ఉందని, టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు విధానాన్ని తెలంగాణ ప్రాజానికానికి వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని, తెలంగాణ ఆవిర్బావం జూన్ 2న అన్ని ప్రాజెక్టుల దగ్గర ఒకరోజు దీక్షచేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వం కల్పిస్తున్న భ్రమలు ప్రజలకు తెలిసొచ్చేలా కార్యాచరణ రూపొందించక పోతే తెలంగాణ సమాజానికి ప్రమాదఘంటికలు తప్పవని టీపీసిసి వివరిస్తోంది. అందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రాజక్టుల అంశంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. జూన్ రెండవ తేదీన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని, నీళ్ళ కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా, మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులను తెర మీదకు తెచ్చింది కేవలం సీఎం చంద్రశేఖర్ రావు జేబులు నింపుకునేందుకే అనే అంశం ప్రజలకు వివరించాలని తెలంగాణ కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణానదిలో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తారని డిసెంబర్ లో ప్రకటించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, సీఎం చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. కృష్ణా నీటి వినియోగం, సౌలభ్యత, నిలువల అంశంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్, సీఎం చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో నాలుగు గంటల పాటు సమావేశమై కుట్రలు పన్నారని, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కులు, సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీల నీరు ప్రతిరోజు ఆంధ్ర ప్రదేశ్ తీసుకువెళ్లేందుకు కుట్ర జరుగుతోందిని అందుకు సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది.