కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల జూన్‌ 7 వరకు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది. దవాఖానలు, మందుల దుకాణాలు మినహా ఇతర అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 8 గంటల కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేసినట్లయ్యింది.