తెలంగాణాలో మళ్ళీ లాక్డౌన్ పెంపు .. ఈ సారి 31 వరకు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

తెలంగాణాలో మళ్ళీ లాక్డౌన్ పెంపు .. ఈ సారి 31 వరకు


శుభ తెలంగాణ (19,మే ,2020) : దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు కరోనా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతోపాటు రాష్ట్రాలకు మరిన్ని సడలింపులు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున సడలింపులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ ఏరియాలు తప్ప మిగతా మొత్తం ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే బస్సులు రోడ్డెక్కుతాయని, అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని గతంలోనే ప్రకటించామని, తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా 31 వరకు లాక్‌డౌన్‌ 4.0ను ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయేవరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.