అంతర్జాతీయం: ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షలు దాటినా కరోనా కేసులు : దేశాలన్నీ లక్డౌన్ లో ఉన్న ఆగని కరోనా దాటి కరోనా మహమ్మారి ప్రభావం , చైనా, దక్షిణ కొరియా, క్యూబా, జర్మనీ వంటి దేశాల్లో త గ్గుముఖం పట్టినా రష్యాలో కల్లోలం రేేపుతోంది. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాపితంగా కరోనా కేసులు;దాటాయి. కొత్తగా వెయ్యి మందికి పైగా మృతిచెందారు. రష్యా, పాకిస్థాన్‌లో మొదటిసారిగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. చైనాలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. ఐరోపా దేశాలు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ప్రభుత్వాలు అక్కడి కార్యాలయాలు, పరిశ్రమలు, చర్చిలు, పార్కులను తెరిచేందుకు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు అమెరికాలో కేసుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉన్నా ట్రంప్ మాత్రం కరోనాతో మృతిచెందేవారి సంఖ్య లక్షలోపే ఉంటుందని అంటున్నారు. కాగా, లాస్ ఏంజెల్స్‌లో లాక్డౌన్ ఎత్తివేయాలని కోరుతూ అక్కడి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇంకోపక్క చైనాపై అమెరికా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ డిబ్ల్యూహెచ్ మాత్రం ప్రశంసించింది. కరోనా నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించిందని వూహాన్లో అమలు చేసిన విధానాలు చూసి అందరూ నేర్చుకోవాలని పేర్కొంది.
Post Top Ad
Monday, May 04, 2020
ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షలు దాటినా కరోనా భాదితులు : లక్షల్లో మృతులు
Admin Details
Subha Telangana News